సుశాంత్ మరణం పై పాక్ బౌలర్... ఆ రోజు నేను..?

సుశాంత్ మరణం పై పాక్ బౌలర్... ఆ రోజు నేను..?

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ సినీ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే సుశాంత్ మరణించి రెండు వారాలు అవుతున్న దాని పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో తో బాలీవుడ్ లో నెపోటిజం అనేది బయటికి వచ్చింది. అయితే సుషాంత్ మరణం పై తాజాగా పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్  షోయబ్ అక్తర్ స్పందించారు. అక్తర్ సుశాంత్ గురించి మాట్లాడుతూ... సుశాంత్‌ మరణం నన్ను కలిచివేసింది. కానీ ఈ ఘటన తరువాత ఓ విషయం నన్ను ఇంకా బాధపడేలా చేసింది. అదేంటంటే... సుశాంత్ ను నేను ఒక్కసారి ముంబైలో చూశాను. ఆ సమయంలో అతను పొడుగు జుట్టుతో కనిపించాడు. అయితే అప్పుడే నాకు తెలిసింది అతను ఎంఎస్‌ ధోని బయోపిక్ లో నటిస్తున్నాడని. ఇక నేను  అప్పుడు అతనితో మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ రోజు అతనితో మాట్లాడితే నా జీతంలో నేను ఎదుర్కున్న సమస్యల గురించి అతనికి చెప్పేవాడిని. సమస్యలు వచ్చినప్పుడు మనిషి వాటిని తట్టుకొని ఎలా నిలబడాలి అనేది అతనికి వివరించేవాడిని. కానీ నేను అతనితో మాట్లాడలేదు. ఆ విషయం నా బాధను ఇప్పుడు రెట్టింపు చేసింది అన్నాడు.