కరోనా ఫండ్స్ కోసం భారత్ × పాక్ మధ్య సిరీస్...?

కరోనా ఫండ్స్ కోసం భారత్ × పాక్ మధ్య సిరీస్...?

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కారణంగా అని దేశాలతో పాటుగా భారత్ అలాగే పాకిస్థాన్ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల కరోనా విరాళాలు సేకరించడానికి భారత్ × పాక్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించి విరాళాలు సేకరించాలని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. అక్తర్ మాట్లాడుతూ... ఈ రెండు దేశాలు కరోనా కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అందువల్ల ఈ సమయం లో  భారత్ × పాక్మూడు మ్యాచ్‌ల సిరీస్ అభిమానులను స్టేడియం లోపలికి  అనుమతించకుండా నిర్వహిస్తే బాగుంటుందని తెలిపాడు. అయితే ప్రస్తుతం అని క్రీడలు రద్దు కావడంతో ప్రేక్షకులు అందరూ చాల నిరుత్సహం లో ఉన్నారు. మరియు ఇరు దేశాలలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి టీవీ వ్యూవర్‌షిప్ బాగా పెరుగుతుంది. అందులో వచ్చిన లాభాన్ని రెండు దేశాలు సమానంగా పంచుకోవాలి అని తెలిపాడు. 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓటమితో సంభంధం లేకుండా ఇరు దేశాలు విజేతలుగా నిలుస్తాయి. విరాట్ కోహ్లీ శతకం బాదితే పాక్ అభిమానులు అలాగే బాబర్ అజామ్ శతకం కొడితే భారత అభిమానులు సంతోషిస్తారు అని తెలిపాడు. అయితే ఈ సిరీస్ ను ఈ రెండు దేశాలలో కాకుండా తటస్థ వేదికగా దుబాయ్‌లో  జరిగితే బాగుంటుంది అని తెలిపాడు. ఒక వేళా ఈ సిరీస్ కారణంగా భారత్-పాక్ మధ్య సంబంధాలు కూడా మెరుగుపడవచ్చు అని అక్తర్ అభిప్రాయపడ్డాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రెండు దేశాలు 2007 నుండి ద్వైపాక్షిక సిరీస్‌ లో తలపడటం లేదు . కేవలం ఐసీసీ టోర్నీల్లో అలాగే ఆసియా కప్ లో మాత్రమే ఈ దేశాలు తలపడుతున్నాయి.