బ్రేకింగ్ : నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్ ..?

బ్రేకింగ్ : నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్ ..?

టాలీవుడ్ నటుడు శివాజీ రాజా అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది. శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు స్టార్ హాస్పటల్ కు తరలించారని తెలుస్తుంది. 'మా' అసోసియేషన్ ఎన్నికల తర్వాత శివాజీ రాజా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కరోనా లాక్ డౌన్ నేపథ్యంలోనూ ఆయన సినీకార్మికులకు ఆహార పదార్ధాలు అందించారు. తన ఫార్మ్ హౌస్ లో తానే స్వయంగా పండించిన కూరగాయలను పంచినట్టు ఆయన వీడియో  ద్వారా వెల్లడించారు. ఇక శివాజీ రాజా ఆరోగ్యానికి సంబందించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  చాలా సినిమాలల్లో శివాజీ రాజా నటించి మెప్పించారు.