నాలుగు నెలల తర్వాత బ్యాట్ పట్టిన భారత ఓపెనర్...

నాలుగు నెలల తర్వాత బ్యాట్ పట్టిన భారత ఓపెనర్...

చాలామంది ఆటగాళ్లు కరోనా కారణంగా వచ్చిన మూడు నెలలకే తమ ట్రైనింగ్ మొదలు పెట్టారు. కానీ టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం దాదాపు నాలుగు నెలల తర్వాత ట్రైనింగ్ మొదలెట్టాడు. తన ప్రాక్టీస్ సెషన్‌లోని వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ గబ్బర్ ఈ విషయాన్ని తెలిపాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మాన్  నాలుగు నెలల తర్వాత చేస్తున్న ప్రాక్టీస్ లోకూడా మంచి టచ్ లో కనిపించాడు. ఈ వీడియోకు ''నాకు బ్యాట్ పై బంతి సౌండ్ చాలా ఇష్టం" అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం ధావన్ సిద్ధమవుతున్నాడు. ఇక ఇన్ని రోజులు తన అభిమానుల కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫోటోలు మరియు వీడియోలను శిఖర్ షేర్ చేసాడు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన స్వదేశీ సిరీస్ నుండి శిఖర్ ధావన్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అయిన గాయం కారణంగా భారత న్యూజిలాండ్ పర్యటన నుంచి గబ్బర్ తప్పుకున్నాడు.