మరో మైలురాయిని దాటిన ధావన్...

మరో మైలురాయిని దాటిన ధావన్...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరో మైలురాయిన దాటేశాడు హైదరాబాద్ ప్లేయర్ శిఖర్ ధావన్... ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధావన్... 4 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 142వ ఐపీఎల్ మ్యాచ్‌ ఆడుతున్న ధావన్... 4 వేల పరుగులు సాధించిన లిస్ట్‌లో చేరిన ఎనిమిది క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 24 బంతులను ఎదుర్కొన్న ధావన్... ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఇక కోల్‌కతాతో జరిగిన 13 మ్యాచ్‌లలో ఆడిన ధావన్ ఇప్పటి వరకు ఆ జట్టుపై 437 పరుగులు చేశాడు. ఇక టాప్ స్కోర్లు సాధించిన లిస్ట్‌లో వరుసగా సురేష్ రైనా, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప ఉన్నారు.