చివర్లో అమ్మకాల ఒత్తిడి

చివర్లో అమ్మకాల ఒత్తిడి

ఉదయం నిలకడగా ప్రారంభమైన మార్కెట్‌ మిడ్‌ సెషన్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇక అక్కడ మద్దతు అందకపోగా, అమ్మకాల ఒత్తిడి రావడంతో స్వల్ప లాభాలతో నిఫ్టి ముగిసింది. ఒకదశలో 10800పైన బలంగా ట్రేడైన నిఫ్టిలో 2 గంటలకల్లా అమ్మకాల ఒత్తిడి మొదలైంది. సుమారు 50 పాయింట్లు దాకా నష్టపోయి... క్రితం ముగింపుతో పోలిస్తే 19 పాయింట్ల లాభంతో 10,786 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా గరిష్ఠ స్థాయి నుంచి 200 పాయింట్ల వరకు తగ్గింది. ఇవాళ నిఫ్టి భారతిఎయిర్‌టెల్‌ 3 శాతం దాకా లాభపడగా, బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా ఇదే స్థాయిలో లాభపడింది. గ్రాసిం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ షేర్లు ఒకటి నుంచి  రెండు  శాతం దాకా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌ ముందుంది. ఈ షేర్‌తో పాటు యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రెండు శాతంపైగా నష్టపోయాయి. ఇక బీఎస్‌ఇలో ఏపీల్‌, జై కార్పొరేషన్‌ 20 శాతం లాభపడగా, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 10 శాతం, పీసీ జ్యువల్లర్స్‌ ఆరున్నర శాతం లాభంతో ముగిశాయి. నష్టపోయినవాటిలో టాటా స్టీల్‌, క్వాలిటీ, క్రిసిల్‌ ఉన్నాయి.