రజినీకాంత్ తో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్..!!

రజినీకాంత్ తో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్..!!

సౌత్ ఇండియాలో రజినీకాంత్ కు ఎలాంటి ఇమేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  రజినీకాంత్ సినిమా పర్వాలేదు అనుకుంటేనే భారీ వసూళ్లు వస్తుంటాయి.  అదే హిట్టయితే చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకొని అద్భుతమైన చిత్రాలు తీసిన దర్శకుడు శంకర్ అని చెప్పొచ్చు.  శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ, రోబో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు సృష్టించాయో చూశాం.  శంకర్ రజిని కాంబినేషన్లో రోబో 2.ఓ రెడీ అవుతోంది.  వచ్చే ఏడాది ఇది విడుదల కావొచ్చు.  షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.  

ఇక ఇదిలా ఉంటె, రజినీకాంత్.. శంకర్ కాంబినేషన్లో ఓ బయోపిక్ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటి వరకు పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాలను మాత్రమే తీసిన శంకర్, తన కమర్షియల్ ఫార్మాట్ ను పక్కన పెట్టి సోషల్ మెసేజ్ ఉన్న ఓ మంచి సినిమా తీయబోతున్నారు.  ట్రాఫిక్ రామస్వామి జీవిత చరిత్ర ఆధారంగా వాస్తవిక కోణంలో సినిమా చేయాలని అనుకుంటున్నారు శంకర్.  ఒక్క తమిళనాడులోనే కాకుండా, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్యలపై రామస్వామి అలుపెరుగని పోరాటం చేశారు.  

ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రజల్లోనూ, అటు ప్రభుత్వాల్లోనూ కదలిక తీసుకొచ్చేనందుకు కృషి చేస్తున్నారు.  ట్రాఫిక్ రామస్వామి గురించిన విషయాలను తెలుసుకున్న శంకర్ ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయాలని అనుకున్నాడు.  ట్రాఫిక్ రామస్వామి పాత్రకు రజినీకాంత్ కరెక్ట్ గా సూట్ అవుతారని శంకర్ విశ్వాసం.  ఇదే నిజమైతే.. మొదటిసారి ఈ కాంబినేషన్లో ఓ బయోపిక్ సినిమాను చూడొచ్చన్నమాట.