ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్న షకీలా సినిమా....!.

ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్న షకీలా సినిమా....!.

శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన భామ షకీలా. 100 కు పైగా సినిమాల్లో నటించిన షకీలా తమిళం మళయాళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో సినిమాలు చేసింది.  . అయితే షకీలా కొన్నేళ్ల నుండి అస్లీల పాత్రలు తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది.షకీలా ప్రధాన పాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్‌ జంటగా నటించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. 24 క్రాఫ్ట్స్‌ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్‌ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిం చారు.సాయి రాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్‌ వి.ఎన్‌ దర్శకత్వం వహించారు.అటు షకీలా సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో కానీ ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా కావడం విశేషం.ఇక ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ సూన్ అని మేకర్స్  సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.