ఆఫ్రిది కి కరోనా నెగెటివ్... 

ఆఫ్రిది కి కరోనా నెగెటివ్... 

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కి కరోనా నెగెటివ్ వచ్చింది. గత నెలలో కరోనా బారిన పడినట్లు ఆఫ్రిది స్వయంగా తెలిపాడు. నేను లాక్ డౌన్ లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఈ వైరస్ బారిన పడతానని నాకు తెలుసు, అయినా ఈ సంక్షోభ సమయంలో పేదవారికి తన ఫౌండేషన్ ద్వారా సహాయం చేసినట్లు తెలిపాడు ఆఫ్రిది. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత నుండి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. అప్పుడు సోషల్ మీడియాలో ఆఫ్రిది ఆరోగ్యం పై అనేక పుకార్లు వచ్చాయి.  ఈ విషయం పై స్పందించి..  గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం మెరుగుపడుతోంది అని ఆఫ్రిది ఓ వీడియో విడుదల చేసారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆఫ్రిది భార్యకు అలాగే ఇద్దరు కూతుళ్లకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆఫ్రిది.. తనకు అలాగే తన కుటుంబసభ్యులకు తాజా కరోనా పరీక్షలో  నెగెటివ్ వచ్చినట్లు తెలిపాడు.