పాక్‌ ఎన్నికల్లో భారత సూపర్‌స్టార్‌ బంధువు!

పాక్‌ ఎన్నికల్లో భారత సూపర్‌స్టార్‌ బంధువు!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ఖాన్‌ బంధువు నూర్ జెహన్ పాకిస్థాన్‌ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వ నియోజకవర్గం నుంచి ఈమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.  షావలి క్వాతల్ ప్రాంతంలో నివసించే జెహాన్‌ కుటుంబం నివశిస్తోంది. వీరింటికి గతంలో పలుమార్లు షారుఖ్‌ విచ్చేశాడని స్థానికులు చెబుతున్నారు. నూర్ జెహన్ గతంలో కౌన్సెలర్‌గా పోటీచేసి గెలుపొందారు. ఈమెకు అవామీ నేషనల్ పార్టీ సీట్‌ ఆఫర్‌ చేసినా సున్నితంగా తిరస్కరించారు.