కొడుకు కోసం తన ప్రాణాలు అర్పించిన రెజ్లర్...

కొడుకు కోసం తన ప్రాణాలు అర్పించిన రెజ్లర్...

కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్‌లో తన కొడుకుతో కలిసి ఈత కొడుతున్న సమయంలో మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అదృశ్యమైన తర్వాత అతని మృతదేహం కనుగొనబడింది. ముందు పదేళ్ల తన పిల్లవాడిని రక్షించమని లైఫ్‌గార్డ్‌లకు సూచించడం ద్వారా తన కొడుకును కాపాడటానికి అతను తన ప్రాణాలు అర్పించాడు. గాస్పర్డ్ మృతదేహాన్ని నిన్న తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు. గాస్పర్డ్ మరియు అతని కుమారుడు బీచ్ కు వెళ్లారు. అయితే అక్కడ వారి ఒక అలలో చిక్కుకున్నారు. అయితే వెంటనే  లైఫ్‌గార్డ్‌లు వారిని రక్షించడానికి వెళ్లగా గాస్పర్డ్ ముందు తన  కుమారుడిని రక్షించమని కోరాడు. వారు ఆ పిల్లాడిని తీసుకొని ఒడ్డుకు వచ్చి మళ్ళీ నీటిలోపలికి వెళ్లి చూడగా అక్కడ గాస్పర్డ్ కనిపించలేదు. అయితే నిన్న ఇక మృతదేహం ఆ పరిసర ప్రాంతాల్లో ఒడ్డుకు వచ్చింది. అయితే అది గాస్పర్డ్ మృతదేహం గా గుర్తించారు పోలీసులు. అయితే కొడుకు ప్రాణాల కోసం తన ప్రాణాలు అర్పించిన తమ రెజ్లర్ గాస్పర్డ్ మృతికి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ సంతాపం తెలిపారు.