అంతరిక్షంలో అలా చేస్తే... మరణం తప్పదా? 

అంతరిక్షంలో అలా చేస్తే... మరణం తప్పదా? 

కొత్త విషయాలు తెలుసుకోవడంలో, కొత్త వాటిపై పరిశోధనలు చేయడంలో మనిషి ఎప్పుడూ ముందు ఉంటాడు.   భూమిపై పరిశోధన చేస్తూనే ఇప్పుడు మనిషి అంతరిక్షంపై కూడా దృష్టి  పెట్టాడు.   అంతరిక్షంలో మనిషి  మనుగడ సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.  భూమిపైనే కాకుండా, ఇతర గ్రహాలపై కూడా మనిషి మనుగడ సాగించాలని చూస్తున్నాడు.  

ఇప్పటికే చంద్రునిపై  అనేక పరిశోధనలు చేశారు.  2024 నాటికి చంద్రునిపై శ్వాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.  అంతరిక్షంపై స్పేస్ ఎక్స్ అనే కంపెనీ విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నది.  స్పేస్ టూరిజాన్నిఅభివృద్ధి చేయాలని చూస్తున్నది స్పేస్ ఎక్స్ కంపెనీ.  ఒకవేళ అనుకున్నట్టుగా స్పేస్ టూరిజం అభివృద్ధి చెందితే, స్పేస్ హనీమూన్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది కంపెనీ.   ఇక్కడే పరిశోధన సంస్థలకు కొత్త చిక్కు వచ్చి పడింది.  అదేమంటే, స్పేస్ లోకి వెళ్లొచ్చు, తిరిగి రావొచ్చు.  కానీ, స్పేస్ హనీమూన్ అనే సరికి చిక్కులు వచ్చిపడుతున్నాయి.  ఎందుకంటే, స్పేస్ లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది. 

ఆ సమయంలో   గుండె నుంచి మెదడుకు రక్త సరఫరా ఈజీగా జరుగుతుంది.  గుండెకు పెద్దగా శ్రమ ఉండదు.  దీంతో గుండె   పనితీరు కాస్త మందగిస్తుంది.  ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే, గుండె ప్రతిస్పందనల వేగం పెరుగుతుంది.  ఫలితంగా హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.   ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానిపై  పరిశోధన చేస్తున్నారు.  స్పేస్ టూరిజం, స్పేస్ హనీమూన్ ను డెవలప్ చేస్తే దానికి తగిన వాతావరణాన్ని స్పేస్ లో క్రియేట్ చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.