వరంగల్‌లో ఘోర విషాదం..బావిలో శవాలుగా తేలిన ఏడుగురు కుటుంబ సభ్యులు

వరంగల్‌లో ఘోర విషాదం..బావిలో శవాలుగా తేలిన ఏడుగురు కుటుంబ సభ్యులు

వరంగల్‌ జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంట బావిలో ఏడుగురు వలస కార్మికుల శవాలుగా తేలారు.. వీరంతా ఆత్మహత్యలకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి... గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్టీయల్ ఏరియాలోని ఓ బారదాన్ గోడౌన్ లో గల బావిలోపండి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు మృతి చెందారు... ఈ బావిలో నుంచి గురువారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను పోలీసులు కనుగొనగా.

కాగా, ఈ రోజు ఉదయం ఒకటి తర్వాత ఒకటి మొత్తం మూడు మృతదేహాలు బావిలో తేలాయి...మృతులంతా బెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తింపు...మృత  దేహాలను బావిలో నుంచి వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు...ఇంకో మృతదేహం కూడా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు బావిలోని నీరు తోడుతున్నారు. సంఘటన స్థలాన్నివరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు...