ఎల్.జి. పాలిమర్స్ కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

ఎల్.జి. పాలిమర్స్ కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ ఘటన ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది.. ఇవాళ ఎల్ జీ పాలిమర్స్ కి సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది..  విషవాయువు లీకేజీ దుర్ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవడాన్ని, హైకోర్టు ప్లాంట్ ను సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది ఎల్.జి. పాలిమర్స్ సంస్థ.. ప్లాంట్ ను సీల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.. ఎల్.జి. పాలిమర్స్ తరుపున ముకుల్ రోత్గి వాదనలు వినిపించారు.. అయితే, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు... తదుపరి విచారణను రెండు వారాలపాటు  వాయిదా వేసింది.