అది జకోవిచ్ తప్పు కాదు.. నా తప్పు

అది జకోవిచ్ తప్పు కాదు.. నా తప్పు

కరోనా తర్వాత ప్రారంభమైన క్రీడా టోర్నీలో క్రోయేషియాలో జరిగిన 'ఆడ్రియా టూర్ ‌ఎగ్జిబిషన్'‌ ఈవెంట్‌ ఒకటి. అయితే అందులో  పాల్గొన ఆటగాడు గ్రిగర్‌ దిమిత్రోవ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది అని తెలిపాడు. ఆ తర్వాత అందులో పాల్గొన వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ తో పాటుగా మరి ఇద్దరికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే అక్కడ కరోనా వ్యాపించడానికి జకోవిచే కారణం అతనిదే తప్పు అని అన్నారు. ఈ టోర్నీ నిర్వహణలో అతను ఏ విధమైన ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఇలా జరిగిగింది అని నిందించారు. తాజాగా ఈ విషయం పై స్పందించిన క్రోయేషియా ప్రధాని ఇది జకోవిచ్ తప్పుకాదు నా కారణంగానే ఇలా జరిగింది అన్నాడు. ప్రపంచ నంబర్ 1 జకోవిచ్ మరియు అతని సోదరుడు ఈ ఈవెంట్‌ను స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి నిర్వహించారు, కరోనావైరస్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సహాయపడటానికి ఇలా చేసారు. అయితే ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు జొకోవిచ్ రెండు క్షమాపణలు తెలిపాడు. అయితే క్రోయేషియా ప్రధాని బ్రనాబిక్ మాత్రం ఇందులో  అతను తప్పు లేదు నా కారణంగానే ఇలా జరిగింది. అందువల్ల అతడిని ఒంటరిగా వదిలేయండి అన్నారు.