భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్...

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు... ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి... సెన్సెక్స్ 301 పాయింట్లు కోల్పోగా... నిఫ్టీ 10,600 దిగువకు జారింది. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొనడంతో వరుసగా నాల్గో రోజు కూడా ఆ ప్రభావం మార్కెట్లపై కనడింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు డాలర్ తో  రూపాయి బలహీన పడడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది.  సెన్సెక్స్ 300.82 పాయింట్లు క్షీణించి 34,848.30 వద్ద ముగియగా...  నిఫ్టీ 86.30 పాయింట్ల నష్టంతో 10,596.40 దగ్గర ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, హెచ్‌యూఎల్, ఐటిసి, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టి, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా, గ్రాసిమ్ లాభాలు ఆర్జించాయి.