పవన్ అమాయకుడు... పోసాని

పవన్ అమాయకుడు... పోసాని

ఎన్టీఆర్ పార్టీ.. జెండా... లాక్కున్న మగ వగలాడి చంద్రబాబు అని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కండువా మార్చేసిన ఘనత బాబుది అని ఆయన ఎద్దేవా చేశారు.  పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవటమే ఆయన ఆరాటం అంటూ చెలరేగి పోయాడు. ఓటుకి నోటులో దొరికి.. విజయవాడ పారిపోయిన బాబుకి.. అభివృద్ధి చేయాలనే ఆరాటమెక్కడిదని ఆయన తెలిపారు. 'బాబుకి ఓటేస్తే.. కమ్మ కులానికి.. కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు,  వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అంటున్నావు. అసలు బీజేపీ అంటరాని పార్టీ అనా.. మీ ఉద్దేశ్యం. ఇన్నాళ్లు బీజేపీ కాళ్ళు నాకిన నీవు, బీజేపీ తో కలవను.. తప్పు అయ్యింది అన్నాడు.. తర్వాత మోడీ కాళ్ళు మొక్కి మళ్ళీ కలిశావ్. ఇప్పుడు మోడీని తిడుతున్నావ్... ఏం మారినట్టు మోడీ. పదవి...నీ సీట్ కోసం ఎవరినైనా చంపుతావ్' అంటూ బాబుపై పోసాని మండిపడ్డారు.  

ఎన్టీఆర్ కి విలువలు లేవన్న బాబు... ఎందుకు భారత రత్న అడిగారని ప్రశ్నించారు. మహానాడులో... ఎందుకు ఆయన విగ్రహం పెట్టారు. ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబం స్పందించాలి అని.. స్పందించకపోతే... మీ నాన్నకు  విలువలు లేవని మీరు కూడా ఒప్పుకున్నట్టే అని ఆయన వివరించారు. రామారావుకి విలువలు లేవనుకుంటే.. ఆయన విగ్రహాలు కూలగొట్టండి. విలువలు ఉన్నాయని అంటే.. పాలాభిషేకం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వద్దని అన్నది నువ్వే.. ఇప్పుడు హోదా ఇవ్వు అంటే ఇస్తాడా..?'జగన్ 46 వేల కోట్లు తిన్నాడని ఆరోపించావు.. నీకు నార్కో టెస్ట్...చేద్దాం టెస్ట్ లో 46 వేల కోట్లు తిన్నారు అని వస్తే... నీకు పాదాభివందనం చేస్తా.. వస్తావా.. టెస్ట్ కి అంటూ బాబుపై పోసాని చెలరేగిపోయారు. జగన్ ని జైల్లో పెడితే...మళ్ళీ గెలవచ్చు అని బాబు ఆలోచిస్తున్నాడని... 15 కేస్ ల పై స్టే తెచ్చుకున్న నువ్వు జగన్ కి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అసలు నీవు ఎంతమందిని మేనేజే చేసుకున్నావ్.. కేసీఆర్ కి ఒక్క శాతం మానవత్వం లేకుంటే.. జైల్లో ఉండేవాడివని ఆయన ఆరోపించారు.'ఇది కమ్మల రాజ్యం.. నేను.. నా తర్వాత లోకేష్.. తర్వాత.. దేవాన్షు సీఎం కావాలనే బాబు ఆలోచిస్తున్నాడు.   కమ్మలో ఇంకోడు ముఖ్యమంత్రి కావొద్దు..? అని బాబు ఆలోచనగా పోసాని వెల్లడించారు.  అంతేకాకుండా పోసాని మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్..అమాయకుడని...సీనియర్ అని బాబుకి మద్దతు ఇచ్చాడని.. రాజకీయాల్లో సీనియారిటీ కాదు.. సిన్సియార్టీ కావాలని పోసాని వివరించారు. ఓ వర్గం మీడియాకి కులం పిచ్చి పట్టిందని.. జగన్ ని ఆ మీడియాలు చంపేశాయని.. సాక్షి లేకుంటే... జగన్ అండమాన్ లో ఉండేవారని పోసాని సూటిగా మాట్లాడారు.