మళ్లీ ఎన్నికలకి వెళ్తే బాబుకు మిగిలేది అదే !

మళ్లీ ఎన్నికలకి వెళ్తే బాబుకు మిగిలేది అదే !

రాజధాని వికేంద్రీకరణ బిల్లు మీద నూతన మంత్రి డా.సీదిరి అప్పలరాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడం చాలా ఆనందంగా ఉందని ఒకరకంగా ఉత్తరాంధ్ర కల సాకారమైందని చెప్పచ్చని అన్నారు. లో బర్త్ వెయిట్ పై యునైటెడ్ నేషన్స్ బాబు హయాంలో ఒక రిపోర్టు ఇచ్చిందని, లో బర్త్ వెయిట్ అనేది అంశం ఆలోచించాల్సిన విషయమని, ఆర్ధిక అసమానత బర్త్ రేట్ కు ప్రధాన కారణమని అన్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని, కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకుని తన వర్గానికి మేలు చేయడం కోసమే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని అన్నారు.

అమరావతి అభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ అని బాబు ఆలోచనన్న ఆయన మిగిలిన ప్రాంతాలకు జరిగే అన్యాయాన్ని చంద్రబాబు కనీసం ఆలోచించలేదని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును బాబు పట్టించుకోలేదని, సొంత అవసరాల కోసం రాజధానిని చంద్రబాబు వాడుకున్నందునే ప్రజలు ఆయన్ని ఇంటికి సాగనంపారని అన్నారు. ఆర్ధిక అసమానతలు ,ఉద్యమాలు తలెత్తకుండా ఉండేందుకే జగన్ వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని, మా ప్రాంతానికి రాజధాని వస్తే అభివృద్ధి చెందుతామని ఉత్తరాంధ్ర వాసులు అనుకుంటున్నారని అన్నారు.

అమరావతే రాజధానిగా కావాలనుకుంటున్న చంద్రబాబుకి సవాల్ అన్న ఆయన చంద్రబాబుకి దమ్ముంటే 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. అలా మళ్లీ ఎన్నికలకు వెళితే బాబుకి మిగిలేది ...ఒకటి...రెండేనని అన్నారు. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే సత్తా ఒక్క జగన్ వల్లే సాధ్యమన్న ఆయన జగన్ మంచి ముహూర్తంలో త్వరలోనే విశాఖలో అడుగు పెడతారని అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం వల్ల ఉత్తరాంధ్రకు మహర్ధశ రావడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు మనస్తత్వం మారాలన్న అయన ప్రజాకోర్టు పై చంద్రబాబుకి నమ్మకం లేదని ఆయన నమ్మకమంతా కోర్టుల మీదనే అని అన్నారు. ప్రజానిర్ణయంతో తీసుకున్న నిర్ణయాన్ని ఏ కోర్టులు ఆపలేవని మంత్రి అన్నారు.