ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడిన వ్యక్తి... రూ.31 కోట్లు గెలుచుకున్నాడు... ఎలాగంటే... 

ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడిన వ్యక్తి... రూ.31 కోట్లు గెలుచుకున్నాడు... ఎలాగంటే... 

ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరూ చెప్పలేరు.  కరోనాకు ముందు బాగా బతికిన వ్యక్తులు కూడా కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు.  ప్రపంచంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఓ సంస్థలో ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు.  అయితే, కరోనా సమయంలో అయన ఉద్యోగం కోల్పోయాడు.  చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.  ఉన్న కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తికి తన దగ్గరున్న డబ్బుతో కూతురికోసం నిత్యవసర వస్తువులు కొనేందుకు వెళ్ళాడు.  తిరిగి వస్తుండగా లాటరీ వెస్ట్ అనే బోర్డు కనిపించింది.  కొంటె బాగుందేమో అని చెప్పి ఓ లాటరీ కొన్నాడు.  

అలా కొన్న అతని టిక్కెట్ కు లాటరీ తగిలింది.  ఏకంగా రూ. 31 కోట్లు గెలుచుకున్నాడు.  ఉద్యోగం కోల్పోయి డబ్బు ఎలా వస్తుందా అని ఆలోచన ఆ వ్యక్తి, ఇప్పుడు వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలా అని చూస్తున్నాడు.  తన అన్న డబ్బుకోసం ఇబ్బందులు పడుతున్నాడని, అతనికి కొంత డబ్బు ఇస్తానని, మంచి ఇల్లు కొనిస్తానని అన్నాడు.  తాను ఓ ఇల్లు కొనుక్కొని కూతురిని బాగా చదివిస్తానని అంటున్నాడు సదరు వ్యక్తి.