బాలికపై అత్యాచారయత్నం... గుంటూరులో 144 సెక్షన్..

బాలికపై అత్యాచారయత్నం... గుంటూరులో 144 సెక్షన్..

ఆంధ్రప్రదేశ్ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారానికి యత్నించిన రఘు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తా దావానలంలా వ్యాపించడంతో.. అర్థరాత్రి బాలిక కుటుంబ సభ్యులు.. బంధువులతో సహా వందలాది మంది.. నిందుతుడిని తమకు అప్పగించాలంటూ దాదాపు 2వేల మంది నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో శృతిమించడంతో ఆందోళనకారులు.. పోలీసులకు మధ్య గొడవ పెరిగింది. రాళ్లు రువ్వకున్నారు. దీంతో 22మంది పోలీసులకు గాయాలయ్యాయి. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న పాత వాహనాలు 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఆరా తీస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులతో ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు గుంటూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. అనుమంతులు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పై దాడి జరిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డవారిని సాంకేతికంగా గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.