మాల్యాపై మరో మూడేళ్లు నిషేధం...

మాల్యాపై మరో మూడేళ్లు నిషేధం...

బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను సెక్యూరిటీస్ మార్కెట్లనుంచి మరో మూడేళ్ల పాటు నిషేధించింది సెబీ. యునైటెడ్ స్పిరిట్స్‌లోకి అక్రమంగా నిధులు మళ్లించినందుకు చర్యలకు పూనుకుంది. ఇదే సమయంలో లిస్టెడ్ కంపెనీల జాబితాలో డైరెక్టర్‌గా మరో ఐదేళ్లపాటు నిషేధించింది. దీంతో పాటు ఇద్దరు మాజీ కంపెనీ డైరెక్టర్లయిన అశోక్ కపూర్, పి.ఎ. మురళిలపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ ఆదేశాల ప్రకారం వీరిద్దరూ మరే ఇతర కంపెనీలో ఏడాది పాటు డైరెక్టర్లుగా పనిచేయడానికి వీలుండదు. అక్రమంగా నిధుల తరలింపు కేసులో విజయ్ మాల్యాతో పాటు మరో ఆరుగురు అధికార్లను ఆరు నెలల పాటు నిషేధిస్తూ 2017, జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లించిన నిధులపై కంపెనీ తప్పుడు లెక్కలను సమర్పించిందని సెబీ పేర్కొంది.