క‌స్ట‌మ‌ర్ల‌ను హెచ్చ‌రించిన ఎస్బీఐ..

క‌స్ట‌మ‌ర్ల‌ను హెచ్చ‌రించిన ఎస్బీఐ..

త‌మ క‌స్ట‌మ‌ర్లు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ హెచ్చ‌రించింది స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. విష‌యం ఏంటంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు సైబ‌ర్ నేర‌గాళ్లు రూట్ మారుస్తూనే ఉంటారు.. ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను అడ్డం పెట్టుకుని అందినంతా దండుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు.. అందులో భాగంగా.. ఉచితంగా క‌రోనా ప‌రీక్ష‌లు అంటూ వ‌ల విసురుతున్నారు.. వారినుంచి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తోంది  ఎస్బీఐ.. ఉచితంగానే క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తామ‌ని చెబుతూ భారీ స్థాయిలో ఫిషింగ్ ఎటాక్స్‌కు పాల్పడవచ్చని వార్నింగ్ ఇచ్చింది... కరోనా వైరస్ టెస్ట్‌లు అంటూ.. సైబర్ మోసగాళ్లు లక్షల మంది వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.. ప్రభుత్వ ఏజెన్సీలు, డిపార్ట్‌మెంట్లు, ఇతర అనుబంధ సంస్థలు, ట్రేడ్ అసోసియేషన్స్‌పై సైబర్ ఎటాక్స్ జరగొచ్చని పేర్కొంది.. ఇప్పుడు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను ఎస్బీఐ అప్ర‌మ‌త్తం చేస్తోంది. 

సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ ఎటాక్స్ దిగనున్నార‌ని హెచ్చ‌రించిన ఎస్బీఐ..  [email protected] మెయిల్ ఐడీతో వ‌చ్చే ఈమెయిల్స్ ప‌ట్ట అత్యంత జాగ్ర‌త్త అవ‌స‌రం అని పేర్కొంది.. వీటికి స్పందించొద్దు.. అస‌లు మెయిల్ ఓపెన్ చేసి క్లిక్ చేయొద్దు అని.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చింది ఎస్బీఐ. ప్ర‌పంచాన్ని క‌రోనా వ‌ణికిస్తోన్న స‌మ‌యంలో.. ఆ టెస్ట్‌లు ఉచితం అంటూ దాదాపు 20 లక్షల మందికి  పైగా మెయిల్స్ రావొచ్చ‌ని ముఖ్యంగా..  ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో నివసించే వారు  మ‌రిత జాగ్రత్తగా ఉండ‌డం అవ‌స‌రం అంటోంది ఎస్బీఐ.