స‌వ్య‌సాచి ఇండిపెండెన్స్ కానుక‌

స‌వ్య‌సాచి ఇండిపెండెన్స్ కానుక‌

అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో `స‌వ్య‌సాచి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదో ప్ర‌యోగాత్మ‌క యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. చందు త‌న‌దైన శైలిలో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ‌తో పాటు, సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో విజువ‌ల్ గ్రాఫిక్స్ ప్రాధాన్య‌త ఊహాతీతంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. 

వాస్త‌వానికి ఈ చిత్రం ఈ స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ కావాల్సింది. నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఆల‌స్యం వ‌ల్ల జూన్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాని జూలై 27 కి వాయిదా వేశారు. అయితే అప్ప‌టికీ ప‌నులు పూర్తయ్యేందుకు ఆస్కారం లేదుట‌. ఆ క్ర‌మంలోనే స‌వ్య‌సాచి ఆగ‌ష్టు 10న రిలీజవుతుంద‌ని చెబుతున్నారు. భారీ వీఎఫ్ఎక్స్ వ‌ల్ల ఈ వాయిదా త‌ప్ప‌ద‌న్న మాటా ఫిలింస‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆగ‌ష్టు 10న రిలీజ్ అంటే స్వాతంత్య్ర‌దినోత్స‌వ కానుక‌గా స‌వ్య‌సాచి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నార‌న్న‌మాట‌!