తెలంగాణా అబ్బాయిపై ప్రేమతో.. సౌదీ అమ్మాయి..

తెలంగాణా అబ్బాయిపై ప్రేమతో.. సౌదీ అమ్మాయి..

జీవనం కోసం ఇండియా నుంచి సౌదీకి వలస వెళ్లిన వారి బ్రతుకులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  వారు అక్కడ పడే బాధలను రోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.  కుటుంబం భారాన్ని మోయం కోసం అడుగడుగునా బాధలను అనుభవిస్తూ.. ఊడిగం చేస్తుంటారు.  దినార్ల కోసం బాధల్ని దిగమింగుకోవడం తెలిసిందే.  కొంతమంది బాధలను భరించలేక పారిపోయి వస్తుంటారు.  కానీ, ఓ అమ్మాయి.. తాను ప్రేమించిన అబ్బాయి కోసం సౌదీని వదిలి ఇండియాకు వచ్చింది.  తన ప్రేమను నిలబెట్టమని పోలీసులను వేడుకుంటున్నది.

తెలంగాణాలోని నిజామాబాద్ నుంచి 30 సంవత్సరాల యువకుడు సౌదీ వెళ్లి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  తను పనిచేసే ఇంటి యజమాని కూతురు ఆ యువకుడితో ప్రేమలో పడింది.  ప్రేమ విషయం బయటకు తెలిస్తే.. తప్పు చేసింది ఎవరైనా శిక్ష మాత్రం భారీగా ఉంటుంది.  అందుకే ఆ యువకుడు సైలెంట్ గా ఉన్నాడు. గత ఫిబ్రవరి నెలలో డ్రైవర్ ఇండియాకు వచ్చేశాడు.  దీంతో ఆ యువతి అక్కడ ఉండలేకపోయింది. ఎలాగైనా ఇండియా రావాలని అనుకుంది.  సౌదీ నుంచి నేపాల్ వచ్చి.. అక్కడి నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించింది.   ఢిల్లీ వచ్చిన యువతిని డ్రైవర్ కలుసుకొని ఇద్దరు కలిసి నిజామాబాద్ వెళ్లి వివాహం చేసుకున్నారు.  

కూతురు సౌదీ నుంచి ఇండియా వచ్చిన విషయాన్ని తెలుసుకున్న యువతి తండ్రి.. హుటాహుటిన ఇండియా వచ్చి హైదరాబాద్ లోని డెప్యూటీ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.  తన కూతురుకి పెళ్లి జరిగిందని.. ఇప్పుడు అక్కడి నుంచి ఇండియాకు అక్రమంగా వచ్చిందని.. తన కూతురిని తనకు అప్పగించాలని తండ్రి కోరాడు.  యువతి తండ్రి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిజామాబాద్ వెళ్లి యువతి గురించి వాకబు చేశారు.  అయితే, యువతి మాత్రం తండ్రితో వెళ్లేందుకు అంగీకరించలేదు.  తనకు, నిజామాబాద్ అబ్బాయితో వివాహం జరిగిందని, ఇండియాలోకి అక్రమంగా వచ్చిన మాట వాస్తవమే కానీ, ఇండియా వచ్చి వివాహం చేసుకున్నానని, తన వివాహాన్ని చట్టబద్దత కల్పించాలని భారత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టు యువతి తెలిపింది. తనను ఎవరు అపహరించుకొని రాలేదని యువతి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొంది.  దీంతో పోలీసులు ఆమెపై తండ్రి పెట్టిన కేసుకు మూసివేశారు.  

నిజామాబాద్...సౌదీ అరేబియా కు చెందిన యువతి తో ఆదిలాబాద్ కు చెందిన యువకుడు అజిముద్దిన్ తో జిల్లా లో వివాహం చేసుకున్నట్లు నిర్దారణ జరిగింది.  పెళ్ళి కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న అజీముధ్దిన్,రజ్ ఆల్ హర్బీ లు కామారెడ్డి లో వివాహం చేసుకున్నారు.  ప్రేమ జంటను జిల్లా అదనపు కోర్ట్ లో ప్రవేశపెట్టారు. తనను అజి ముధ్దిన్ కిడ్నాప్ చేయ లేదని తన తండ్రి పెట్టిన కేసు ను కొట్టి వేయాలని యువతి జడ్జిని కోరింది.  ఇద్దరు మేజర్లు కావడం,ఇష్ట పూర్వకంగానే వచ్చినట్లు యువతి తేలపడంతో ఇద్దరిని విడుదల చేయాలని కోర్ట్ ఆదేశించింది.