చార్మినార్ వద్ద సారా ఖాన్ సందడి 

చార్మినార్ వద్ద సారా ఖాన్ సందడి 

బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సింబా చిత్ర షూటింగ్ కోసం హైదరాబద్ లో ఉన్నారు. రంజాన్ మాసం కావడంతో నిన్న రాత్రి చార్మినార్ దగ్గర్లోని లాడ్ బాజార్ కి ఈమె తన తల్లి అమ్రిత సింగ్ తో కలిసి వెళ్లారు. అక్కడికెళ్లి కావాల్సిన వస్తువులను తీసుకుని చిన్నపాటి షాపింగ్ కూడా చేసింది. ఇలా ఆ బజార్ లో ఉన్నప్పుడు ఈమె ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం సింబా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో హిట్ చిత్రమైన టెంపర్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.