కోవిడ్ ఐసీయూ వార్డ్ కు కల్నల్ సంతోష్ బాబు పేరు..!

 కోవిడ్ ఐసీయూ వార్డ్ కు కల్నల్ సంతోష్ బాబు పేరు..!

గాల్వన్ లోయలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 20 మంది జవాన్ల గుర్తుగా ఢిల్లీలోని సర్ధార్‌ వల్లభాయ్ పటేల్ కోవిడ్ దవాఖానలోని వివిధ వార్డులకు వారి పేర్లను పెట్టాలని  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) నిర్ణయం తీసుకుంది. అమరవీరుల గుర్తుగా ఈ పేర్లను పెడుతున్నట్టు  DRDO అధికారులు వెల్లడించారు. కాగా కల్నల్ సంతోష్ బాబు పేరును ఐసీయూ వార్డుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు డీఆర్‌డీఓ ఛైర్మెన్ సంజీవ్ జోషి తెలిపారు. 10వేల పడకలు గల ఈ హాస్పిటల్ ను కరోనా బాధితులకోసం నిర్మించారు.  ఆస్పత్రిని అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు కలిసి ఆదివారం ప్రారంభించనున్నారు. కోవిడ్ ఆస్పత్రిలోని వార్డులకు అమరుల పేర్లను పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా అమరుల త్యాగం చిర స్థాయిగా నిలిచిపోతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.