బీసీసీఐకి మంజ్రేకర్ లేఖ... ఈసారి బుద్ధిగా ఉంటాను..

బీసీసీఐకి మంజ్రేకర్ లేఖ... ఈసారి బుద్ధిగా ఉంటాను..

భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ను బీసీసీఐ ఈ ఏడాది మార్చి లో తమ కామెంట్రీ ఫ్యానల్ నుంచి తొలగించింది. అయితే గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అవమానిస్తూ వ్యాఖ్యానించాడు మంజ్రేకర్. అలాగే అంతకముందు మరో కామెంటేటర్ హర్షా భోగ్లేని కూడా అవమానిస్తూ మాట్లాడటంతో గత సంవత్సర కాలంగా అతని కామెంటరీ పై విమర్శలు వస్తున్నాయి. దాంతో మంజ్రేకర్ ని ఈ ఏడాది బీసీసీఐ కామెంట్రీ ఫ్యానల్ నుండి తొలగించారు. అందువల్ల అతను భారత మ్యాచ్ లకు మాత్రమే కాకుండా ఐపీఎల్ కూడా కామెంట్రీ చెప్పే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక తాజాగా కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020 జరుగుతుంది అని ప్రకటన వచ్చింది. అందువల్ల త్వరలోనే ఈ లీగ్ కోసం కామెంట్రీ ఫ్యానల్‌ని బీసీసీఐ ఎంపికచేస్తుంది. కాబట్టి బీసీసీఐకి క్షమాపణ కోరుతూ లేఖ రాసాడు మంజ్రేకర్. అందులో ఇక నుండి ఎవరిని అవమానించే విధంగా కామెంట్రీ  చేయకుండా బుద్ధిగా ఉంటాను అని తెలిపాడు. మరి ఈ లేఖ పై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.