లోకేష్ పేరుతో వసూళ్లు...

లోకేష్ పేరుతో వసూళ్లు...

నాకు సీఎం తెలుసు, మంత్రి తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, కలెక్టర్ తెలుసు, ఫలానా అధికారి తెలుసంటూ బెదిరింపులకు పాల్పడడం చూశాం... ఇప్పుడు ఏకంగా ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పేరుతో వసూళ్ల దందాకు తెరలేపింది ఓ గ్యాంగ్... తుళ్లూరు మండలం బొరుపాలెం ఇసుక రీచ్‌లో మంత్రి నారా లోకేష్ పేరుతో వసూళ్లకు దిగారు. లారీల్లో ఇసుక నింపేందుకు లారీ డ్రైవర్ల దగ్గర నగదు వసూలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ దగ్గర ఓఎస్‌డీగా పనిచేస్తున్న గుత్తా కిరణ్ తండ్రి గుత్తా రామకృష్ణ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా తప్పుకున్న సిబ్బంది... మా యజమాని ఆదేశాలతో మేం వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక వసూళ్లు చేయడమే కాదు... బ్లూ ప్రొగ్ మొబైల్ టెక్నాలజీ పేరుతో ఈ మూఠా రసీదులు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు, మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదనే ఆరోపణలున్నాయి.