శామ్‌సొనైట్‌ బాస్‌ ఔట్‌... ఎందుకంటే...

శామ్‌సొనైట్‌ బాస్‌ ఔట్‌... ఎందుకంటే...

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ లగేజ్‌ మేకర్‌ శామ్‌సొనైట్‌  చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రమేష్‌ తైన్‌వాలా రాజీనామా చేశారు. బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌లో తాను డాక్టరేట్‌ చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలడంతో కంపెనీ రమేష్‌ను పదవి నుంచి తప్పించింది. రమేష్‌ విద్యార్హతలపై ఓ ఇన్వెస్ట్ మెంట్‌ కంపెనీ ఫిర్యాదు చేయడంతో... ఈ వ్యవహారంపై విచారణ జరిగింది.  అయితే దీనిపై కంపెనీ సూటిగా స్పందించకుండా... వ్యక్తిగత కారణాలతో రమేష్‌ రాజీనామా చేసినట్లు తెలిపింది.  బ్లూ ఓక్రా క్యాపిటల్‌ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ రమేష్‌ విద్యార్హతలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన తప్పుడు డిగ్రీలతో మోసం చేస్తున్నాడని, కంపెనీకి సంబంధించిన వాస్తవ గణాంకాలను ఎక్కువ చేసి చూపుతున్నారని ఆరోపించింది. యూనియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ తీసుకున్నట్లు రమేష్‌ కంపెనీకి తెలుపడంతో తన సొంత వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే యూనివర్సిటీ అధికారులతో వెరిఫై చేయగా, అతను పీహెచ్‌డీలో చేరినమాట నిజమేనని..అయితే అతను రెండేళ్ళలోపే వెళ్ళిపోయాడని, పీహెచ్‌డీ పూర్తి చేయలేదని వెల్లడైంది.
ఈ సంస్థ ట్వీట్‌ చేశాక.. రమేష్‌ కూడా తన సొంత వెబ్‌సైట్‌లో విద్యార్హతలు తెలిపే పేజీని తొలగించారు.