తప్పు నాదే... వారు నన్ను ప్రేమతో పిలిచారు : డారెన్ సమీ

తప్పు నాదే... వారు నన్ను ప్రేమతో పిలిచారు : డారెన్ సమీ

మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహచరులు కొంతమంది తనపై జాతి వివక్షత చూపించారని ఆరోయించాడు. అయితే తరువాత టీ 20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ డారెన్ సమీ వారిలో ఒకరితో నేను సంభాషించానని, మాజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహచరుడిని ప్రస్తావించాడు. ఐపీఎల్ లో ఎస్‌ఆర్‌హెచ్‌ లో ఆడుతున్న సమయంలో తాను జాతి వివక్షతకు గురయ్యానని డారెన్ సమీ ఈ నెల ప్రారంభంలో ఎమోషనల్ పోస్ట్‌తో ముందుకు వచ్చాడు. తన సహచరులలో కొంతమంది తనను 'కలు' అని పిలిచారని, ఇటీవల ఒక టెలివిజన్ షో చూసిన తర్వాత ఈ పదానికి అర్ధం తెలిసి ఐపీఎల్ లో జాత్యహంకార గురించి తెలుసుకున్నానని సమీ చెప్పాడు.

అయితే "నేను ఒక వ్యక్తితో ఈ మద్య నిజంగా ఆసక్తికరమైన సంభాషణ చేశానని చెప్పాడు. అయితే అప్పుడు నాకు తెలిసింది వారు నన్ను ప్రేమతో పిలిచారని. తన ఫై ఎటువంటి జాతి వివక్షత చూపించలేదు అని ఆ ఆటగాడు నాకు భరోసా ఇచ్చాడు మరియు నేను అతన్ని నమ్ముతాను" అని డేరెన్ సామి సోషల్ మీడియాలో అన్నారు. డేరెన్ సమ్మీ ఆరోపణలు చేసిన తరువాత, భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ వెస్టిండీస్ క్రికెటర్‌ పై  'కలు' అనే పదాన్ని 2014 లో సోషల్ మీడియాలో ఉపయోగించారు.