నైరుతిలో తలపడుతున్న ఘట్టమనేని.. నందమూరి..

నైరుతిలో తలపడుతున్న ఘట్టమనేని.. నందమూరి..

సమ్మర్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగితే.. సెకండ్ హాఫ్ మాత్రం చప్పగా సాగింది.  ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పునర్వైభవాన్ని తెచ్చిపెట్టాయి.  వరసగా వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.  ఇక సెండ్ హాఫ్ లో వచ్చిన బన్నీ నాపేరు సూర్య, రవితేజ నేల టిక్కెట్టు, నాగార్జున ఆఫీసర్ లు నిరాశను కలిగించాయి.  ఇప్పుడు నైరుతిలో రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.  అందులో ఒకటి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుదీర్ బాబు నటించిన సమ్మోహనం కాగా రెండోది నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే.  ఈ రెండు కూడా ప్రేమకథా చిత్రాలే.  

విభిన్నమైన ప్రేమకథలతో వస్తున్న ఈ రెండు సినిమాలపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.  కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే వంటి వైవిధ్యభరితమైన కథతో వచ్చి హిట్ కొట్టి.. ఇప్పుడు నా నువ్వే అంటూ డిఫరెంట్ లవ్ స్టోరీతో వస్తున్నాడు.  అటు సుదీర్ బాబు కూడా సమ్మోహనం అంటూ ముందుకు వస్తున్నాడు.  రెండు సినిమాలు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి.  సమ్మోహనం సినిమాను అటు చిరంజీవి, ఇటు మహేష్ బాబులు ప్రమోషన్ చేశారు.  కళ్యాణ్ రామ్ సినిమా కూడా ప్రమోషన్ బిజీలో ఉన్నది.  నైరుతి విజేత ఎవరో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  రెండు సినిమాలు హిట్టయితే.. తెలుగు సినిమాకు తిరిగి మంచి రోజులు వచ్చినట్టే అవుతుంది.