పారితోషికం పెంచిన స‌మంత‌ .. కారణం

పారితోషికం పెంచిన స‌మంత‌ .. కారణం

నాగ‌చైత‌న్య‌తో పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్‌గా ఎంత జోష్ కొన‌సాగించిందో, పెళ్లి త‌ర‌వాత‌ అంత‌కుమించి స‌మంత కెరీర్‌లో జోష్ పెరిగింది. ఇప్ప‌టికిప్పుడు ఓ రెండు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రిన్ని ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఏడాదిగా స‌మంత స‌క్సెస్ జోరు కొన‌సాగుతోంది. రాజుగారి గ‌ది2, మెర్స‌ల్‌, రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి .. అన్నీ స‌క్సెస్‌లే. హ్యాట్రిక్ కొట్టి, డ‌బుల్ హ్యాట్రిక్ వైపు దూసుకెళుతోంది. ఈ స్పీడ్‌లోనే పారితోషికం పెంచే ఆలోచ‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది. 

స‌మంత‌కు ఉన్న ఈ స‌క్సెస్ ట్రాక్ దృష్ట్యా తాను ఎంత అడిగినా ఇచ్చేందుకు టాలీవుడ్ నిర్మాతలు ప్రిప‌రేష‌న్‌లోనే ఉన్నార‌ట‌. వాస్త‌వానికి గ‌త ఏడాది పెళ్లికి ముందు పారితోషికం త‌గ్గించుకోవ‌డం ద్వారా అవ‌కాశాలు పెంచుకునే ఎత్తుగ‌డ వేసింది సామ్‌. ఆ క్ర‌మంలోనే వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసింది. పెళ్లి త‌ర‌వాత ఐదేళ్లు ఖాళీ లేనంత‌గా ప్లానింగ్ న‌డించింది. కానీ ప్ర‌స్తుత స‌న్నివేశంలో అప్ర‌తిహ‌తంగా జైత్ర యాత్ర సాగుతున్న వేళ త‌న‌కు డిమాండ్ అంతే ఇదిగా పెరుగుతోంది. ఆ క్ర‌మంలోనే పారితోషికం పెంచాల‌న్న నిర్ణ‌యానికి స‌మంత వ‌చ్చింద‌ని తెలుస్తోంది. పెళ్లి త‌ర‌వాత వేరే ఏ క‌థానాయిక కెరీర్ ఇలా సాగ‌లేదు. నాడు సావిత్ర‌మ్మ కెరీర్ అలా సాగితే, ఇప్పుడు సామ్ కెరీర్ అలా ఉత్త‌మ ద‌శ‌లో ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. `మ‌హాన‌టి` స‌క్సెస్ స‌మంత‌లో జోష్ పెంచింద‌ని చెబుతున్నారు. `యూట‌ర్న్` రీమేక్‌తో పాటు, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ చిత్రంలో స‌మంత‌ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.