చై - సామ్ వెడ్డింగ్‌ వీడియో - సోషల్ మీడియాలో హల్చల్

చై - సామ్ వెడ్డింగ్‌ వీడియో - సోషల్ మీడియాలో హల్చల్

అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట వివాహం గ‌త అక్టోబ‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అటుపై ఆ ఇద్ద‌రూ ఎవ‌రికివారు కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీ అయిపోయారు. పెళ్లి త‌ర‌వాత ఏ ఇత‌ర క‌థానాయిక‌కు ద‌క్క‌ని అవ‌కాశం అక్కినేని కోడ‌లుకు ద‌క్కింది. కెరీర్ ప‌రంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌మంత వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. 

అదంతా స‌రే.. నాడు అక్కినేని వెడ్డింగుకి సంబంధించిన  ఓ వీడియోని స‌మంత స్వ‌యంగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పూర్తి సినిమాటిక్ మోడ్‌లో క‌నిపిస్తోంది. ప్ర‌త్యేకించి టీజ‌ర్ త‌ర‌హాలో ఎడిటింగ్ .. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పెళ్లి వేళ చై- సామ్ ప్రిప‌రేష‌న్స్ ఏ తీరుగా సాగాయో ఈ వీడియోలో ఆవిష్క‌రించారు. ఈ వీడియో రూప‌క‌ర్త జోసెఫ్ రాధిక్‌కి సామ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.