నేటి నుండి కొరియా ఓపెన్‌

నేటి నుండి కొరియా ఓపెన్‌

చైనా, జపాన్ ఓపెన్‌ వరుస సిరీస్ లు ఆడుతున్న భారత ఆటగాళ్లు మరో సమరానికి సిద్ధమయ్యారు. ఈ రోజు నుండి కొరియా ఓపెన్‌ ప్రారంభమవనుంది. చైనా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఈ కొరియా ఓపెన్‌లో తన దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. సైనా మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో కిమ్‌ హ్యో మిన్‌(కొరియా)తో తలపడుతుంది. వైష్ణవి జక్కారెడ్డి తొలి మ్యాచ్‌లో జాంగ్‌(అమెరికా)ను ఢీకొట్టనుంది. సమీర్‌ వర్మ తొలి రౌండ్లో అంటాన్సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడతాడు.

విరామం లేకుండా చైనా, జపాన్ ఓపెన్‌ వంటి వరుస సిరీస్ లు ఆడుతున్న స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు కొరియా ఓపెన్‌ బరిలోకి దిగట్లేదు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ కూడా ఈ టోర్నీ ఆడట్లేదు. అతను జపాన్‌ ఓపెన్‌, చైనా ఓపెన్‌ల్లో కూడా ఆడని సంగతి తెలిసిందే.