సైనా డేటింగ్ లో ఉందా?

సైనా డేటింగ్ లో ఉందా?

ఇండియన్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ డేటింగ్ లో ఉందా? అంటే.. అవుననే సమాదానాలు వస్తున్నాయి. ఈ సమాదానాలకు కారణం ఒక ఫొటో. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంత కాలంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రేమ వ్యవహారంపై ఇద్దరు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా సైనా హైదరాబాద్ నగరంలోని ఓ రెస్టారెంటులో ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ చేస్తున్నారు. ఇద్దరిదీ పర్ఫెక్ట్ జోడీ. ముందుకువెళ్ళండి అని కొందరు కామెంట్ చేయగా... సరైన జోడి, పెళ్లిచేసుకోండి అని మరికొందరు ట్వీటారు. అయితే చాలా మంది ఫాన్స్ పెళ్లి చేసుకోండని కామెంట్ చేశారు.  

Photo: FileShot