సాయి పల్లవి సీరియస్ వార్నింగ్.. ఇంకోసారి అలా పిలవొద్దు

సాయి పల్లవి సీరియస్ వార్నింగ్.. ఇంకోసారి అలా పిలవొద్దు

‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కా తెలంగాణ అమ్మాయిగా.. భానుమతి    పాత్రలో ఒదిగిపోయింది. ఆ సినిమా తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఎన్జీకె', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త స్పీడ్ తగ్గింది. ప్రస్తుతం  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది. ఇదిలా ఉండగా.. ఆమె మొదట పలు తమిళ సినిమాల్లో నటించింది. నిజానికి సాయి పల్లవి  తమిళమ్మాయి. అయితే మలయాళ ‘ప్రేమమ్’ సినిమా ఈమెకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవిని యాంకర్ మలయాళీ అని పిలవడంతో కోపం వచ్చిందట 'అసలు నేను మలయాళీని కాను.. నేను తమిళమ్మాయిని.. కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అని మాత్రం పిలవకండి' అంటూ సమాధానం ఇచ్చిందట సాయి పల్లవి.