ఆటో రాణి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

ఆటో రాణి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

తెలుగు, త‌మిళ్‌లో సాయి ప‌ల్ల‌వి హ‌వా గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభ‌మే ప్రేమ‌మ్‌, ఫిదా చిత్రాల‌తో బంప‌ర్ హిట్లు కొట్టింది. ఇరు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ఆక‌ట్టుకుంది. `ఫిదా`లో నైజాం భామ‌గా అద్భుత‌మైన అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఆ క్ర‌మంలోనే సాయి ప‌ల్ల‌వి కోస‌మే క‌థ‌లు రాసుకునే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు పెరిగారు. ఇటీవ‌లే రిలీజైన `క‌ణం` బాక్సాఫీస్ ఫ‌లితం మాట అలా ఉంచితే, ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ భామ హ‌వా కేవ‌లం తెలుగు ప‌రిశ్ర‌మ వ‌రకే అనుకుంటే పొర‌పాటే.. అటు త‌మిళంలోనూ సాయి ప‌ల్ల‌వికి మాంచి గిరాకీ ఉంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ `కారు` (క‌ణం) ద్విభాషా చిత్రానికి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసుకోవడాన్ని బ‌ట్టి త‌న హ‌వా అక‌క‌డ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ స‌ర‌స‌న `మారి 2`లో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది. కాన్సెప్టుకు ప‌ట్టంగ‌ట్టే త‌మిళ‌నాట .. సాయి ప‌ల్ల‌వి త‌న‌ని తాను మ‌రింత కొత్త‌గా ఆవిష్క‌రించుకుంటోంది.

మారి -2 చిత్రంలో ఈ భామ ఆటో క్వీన్ పాత్ర‌లో న‌టించ‌నుందిట‌. ప్ర‌స్తుతం చెన్న‌య్‌లో ఆటో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ సంద‌డి చేస్తోంది. వాస్త‌వానికి మారి-2లో ధ‌నుష్ స‌ర‌స‌న చంద‌మామ కాజ‌ల్ న‌టించింది. పార్ట్ 2లో ఏకంగా సాయి ప‌ల్ల‌వితో రీప్లేష్ చేయ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేదు. కానీ ఆటో రాణిగా సాయి ప‌ల్ల‌వి మాత్ర‌మే యాప్ట్. ఇక తొలి భాగంలోని కాజ‌ల్ పాత్ర‌కు ఇది కొన‌సాగింపు పాత్ర కానేకాద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక కెరీర్ ఆద్యంతం ప్ర‌యోగాలు చేస్తున్న సాయి ప‌ల్ల‌వి ఆటోరాణిగా ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.