అమితాబ్ కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్న సచిన్... 

అమితాబ్ కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్న సచిన్... 

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అలాగే ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ఈ విషయం పైన ‌ అమితాబ్ తన ట్విట్ లో తెలిపారు. ఆ తర్వాత ఆయన కోలుకోవాలని చాలామంది సెలబ్రెటీలు ట్విట్ చేసారు. ఇక భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్  అమితాబ్, అభిషేక్ ఈ వైరస్ నుండి బయటపడాలని తన ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అందులో..  '' మీరు బలంగా ఉండండి. మీ ఆరోగ్యం మరియు మీ కుటుంబం యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.  జాగ్రత్తలు తీసుకోండి" అని తెలిపారు. అలాగే యువరాజ్ సింగ్  మీరు ఈ వైరస్ నుండి  త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు.  అమితాబ్ ప్రస్తుతం ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో  ఉన్నారు.