ఇదే రోజు మళ్ళీ పుట్టా..ఆర్ఎక్స్ 100 హీరో ఎమోషనల్ పోస్ట్.!

   ఇదే రోజు మళ్ళీ పుట్టా..ఆర్ఎక్స్ 100 హీరో ఎమోషనల్ పోస్ట్.!

ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హీరో కార్తికేయ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో మరియు సినిమాలో లవ్ ఫెయిల్యూర్ నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక మొదటి సినిమాతోనే మరిన్ని ఆఫర్లను దక్కించుకున్నాడు. అనంతరం హిప్పీ సినిమాతోనూ కార్తికేయ మరింతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా కార్తికేయ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అతడు నటించిన ‘ఆర్​ఎక్స్ 100’ రిలీజై, రెండు సంవత్సరాలు పూర్తయిన నేప‌థ్యంలో తన భావాన్ని ఇలా పంచుకున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు తాను మళ్లీ పుట్టానని..ఇదే రోజు క‌ల‌ల‌పై విశ్వాసం, అద్బుతాల‌పై న‌మ్మ‌కం కలిగిందని పేర్కొన్నారు. త‌న పునర్జ‌మ్మ‌కు కారణమైన తన తండ్రిలాంటి దర్శకుడు అజయ్ భూపతికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. ఈ పోస్ట్ లో ఆయన సినిమాలో చొక్కా విప్పి సంబరాలు చేసుకునే ఫోటోను పోస్ట్ చేసాడు.