ఇంటర్మీడియట్‌ బోర్డులో బస్సు చార్జీల రచ్చ...!

ఇంటర్మీడియట్‌ బోర్డులో బస్సు చార్జీల రచ్చ...!

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష పత్రాల పేపర్లు దిద్దడానికి వెళ్లిన లెక్చరర్ల మధ్య బస్సు చార్జీల విషయంలో రచ్చ జరుగుతోంది. పేపర్ల వేల్యుయేషన్‌కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది ఇంటర్మీడియట్‌ బోర్డు. ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీకి స్పష్టం చేసింది బోర్డు. అయితే, ఆ సమయంలో ఆర్టీసీ చార్జీలు వసూలు చేయలేదు. ఇటీవల ఇంటర్మీడియట్‌ బోర్డుకు ఆర్టీసీ లేఖ రాసింది.  దీంతో చార్జీలు కట్టాలని వేల్యూషనర్లను కోరింది ఇంటర్మీడియట్‌ బోర్డు.

బస్సులు బోర్డు ఏర్పాటు చేసింది కనుక ప్రయాణ చార్జీలు వసూలు చేయరనుకున్నాం అంటున్నారు లెక్చరర్లు. అంతేకాదు... ఆర్టీసీ డబుల్‌ చార్జీ వసూలు చేసిందని, సగం మేం భరిస్తాం, మిగత సగం మీరు కట్టండని లెక్చరర్లకు సూచిస్తోంది ఇంటర్మీడియట్‌ బోర్డు. అయితే కష్ట కాలంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పేపర్ వాల్యుయేషన్‌కి... ఇప్పుడు తమ నుంచి చార్జీలు వసూలు చేయడం అన్యాయం అంటున్నారు లెక్చరర్లు.