ఆర్టీసీ కార్మికులంతా సిద్ధంగా ఉండాలి: రాజిరెడ్డి

ఆర్టీసీ కార్మికులంతా సిద్ధంగా ఉండాలి: రాజిరెడ్డి

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ కె.రాజిరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా చర్చల పేరుతో గందరగోళం సృష్టిస్తూ లోపాయికారి బప్పందానికి టీఎంయూ ప్రయత్నిస్తున్నట్లు అనుమానంగా ఉందని రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీకి ఎంతో కొంత ఐఆర్ ఇచ్చే  ఆలోచనలో ప్రభుత్వం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకు జరిగిన చర్చల సారాంశంను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులంతా సిద్ధంగా ఉండాలని రాజిరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు.

అయితే మంత్రుల కమిటీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లిన నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై, కార్మికుల డిమాండ్లపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. అయితే తమకు అనుకూలమైన ప్రకటన రాకపోతే సమ్మెకు వెళ్లేందుకు అటు కార్మికులు కూడా సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు సమ్మె కొనసాగనున్న నేపథ్యంలో దూరప్రాంత రిజర్వేషన్లను ఆర్టీసీ నిలిపివేసింది.