ఒకేరోజు ఏపీలో రూ.60 కోట్లు తాగేశారు..!

ఒకేరోజు ఏపీలో రూ.60 కోట్లు తాగేశారు..!

కరోనా లాక్‌డౌన్‌లో తొలిసారి మద్యం షాపులు తెరుచుకోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ  చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి వైన్స్ షాపుల ముందు.. భౌతికదూరం గాలికొదిలేసి ఒకర్నొకరు తోసుకుంటూ.. మాస్కులు, సానిటైజర్లు లాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మద్యం షాపుల దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. దీంతో.. తిరునాళ్లను తలపించాయి మద్యం షాపులు.. కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టి షాపులు ఓపెన్ చేస్తే.. మరికొన్ని చోట్ల బాణాసంచాల పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక.. మందు బాటిల్‌ చేతిలో పబడినవాళ్ల ఆనందానికి అవదులే లేకుండా పోయాయి.. ఒక్క బాటిల్ దొరికొతే చాలు అన్నట్టుగా మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి లైన్లలో నిలబడి.. ఒక్క బాటిల్ చేతిలో పడగనే ఎగిరిగంతేశారు. ఇక, పలుచోట్ల తొక్కిసలాటలు, తోపులాటలు జరగడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పి.. మందుబాబులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు ఒకే రోజు రికార్డు స్థాయిలో మద్యాన్ని తాగేశారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 మద్యం షాపులు ఉండగా.. 2,345 వైన్స్‌ షాపులను మాత్రమే తెరిచారు అధికారులు. నిన్న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా రోజూ రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు సాగిస్తారట.. అయితే, రాష్ట్రంలో రెడ్‌జోన్లు ఉండడంతో దాదాపు మూడో వంతు దుకాణాలు తెరుచోలేదు.. మరోవైపు మద్యం ధరలు కూడా పెరిగాయి.. దీంతో.. ఒకే రోజు రూ.60 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయని చెబుతున్నారు.