కొత్త జెర్సీలో రాజస్థాన్ రాయల్స్...

కొత్త జెర్సీలో రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్-11లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కొత్త జెర్సీలో బరిలోకి దిగనుంది. ప్రజల్లో క్యాన్సర్‌పై  అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ జట్టు పింక్ జెర్సీలో మైదానంలోకి అడుగెట్టనుంది. ఈ కొత్త జెర్సీలను కెప్టెన్ రహానే ఈ రోజు ఆవిష్కరించారు. రహానేతో పాటు హెన్రిక్ క్లాసెన్, కృష్ణప్ప గౌతమ్, మహిపాల్ లొమ్రోర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రహానే మాట్లాడుతూ.. నాకు ఈ పని చిన్నదిగా అనిపిస్తుంది.. కానీ క్యాన్సర్ రహిత సమాజం కోసం మేం చేసే పని చాలా కీలకమైనది అని అన్నారు. ఈ మ్యాచ్ ఏ కాదు.. వచ్చే మ్యాచ్‌లలో కూడా ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన తీసుకురావాలి అని భావిస్తున్నా అని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను రాజస్థాన్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాజస్థాన్ జట్టు మూడు రంగులతో కూడిన ఈ ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది.