రాయల్స్‌దే విక్టరీ..

రాయల్స్‌దే విక్టరీ..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  177 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగా ఛేదించింది. రాయల్స్‌ ఆటగాళ్లలో బట్లర్‌(95 నాటౌట్‌;60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకూ ఉండి జట్టును గెలిపించాడు. విజయానికి 12 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో గౌతమ్ రెండు సిక్సర్లు కొట్టి శభాష్‌ అనిపించాడు. అంతకముందు సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 19 పరుగుల వద్ద రాయడు(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో వాట్సన్‌,  రైనా రెండో వికెట్‌ 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 39 పరుగులకు వాట్సన్, 52 పరుగులకు రైనా అవుటయ్యారు. తర్వత బ్యాటింగ్‌కు వచ్చిన ధోని(33 నాటౌట్‌; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌),  సామ్‌ బిల్లింగ్స్‌(27;‌ 22 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడారు.