రహానేకు జరిమానా...

రహానేకు జరిమానా...

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేకు భారీ జరిమానా పడింది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. స్లో ఓవర్‌రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఈ సీజన్‌-11లో రాజస్థాన్ టీమ్ తొలిసారి స్లో ఓవర్‌రేట్ కు పాల్పడటంతో.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం రాజస్థాన్ జట్టు కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు ఐపీఎల్ వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ బట్లర్(94) అద్భుత ఇన్నింగ్స్ తో.. ముంబైపై గెలిచింది. ఆడిన 12 మ్యాచుల్లో 6 విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది రాజస్థాన్. మూడు వరుస విజయాలతో ఊపు మీదున్న రాజస్థాన్ రేపు ఈడెన్ గార్డెన్స్  లో కోల్కతాతో తలపడుతుంది.