విశాఖజిల్లాలో రెచ్చిపోయిన రౌడీషీటర్లు...

విశాఖజిల్లాలో రెచ్చిపోయిన రౌడీషీటర్లు...

విశాఖజిల్లాలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అనకాపల్లిలో పేరు మోసిన రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గ్రామ శివార్లలోని తోటల్లో మద్యంతో విందు వినోదాలతో చెలరేగారు. వివిధ ప్రాంతాల నుంచి ఆ సెలబ్రేషన్స్ కు 20మందికి పైగా రౌడీ షీటర్లు వచ్చారు. ఎస్పీ కృష్ణారావుకు ఈ విషయం గురించి సమాచారం రావడంతో రంగంలోకి దిగారు. అయితే పోలీసులు వస్తున్నారని పసిగట్టిన రౌడీ షీటర్లు అక్కడి నుండి పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం ఇలాగె గాజువాకలో బౌన్సర్లతో హోటల్లో పార్టీ చేసుకున్నాడు రౌడీషీటర్ చిట్టిమాము. అప్పుడు సిటీ టాస్క్ ఫోర్స్ ఆఫిసర్లు చేసిన దాడుల్లో పలువురు అరెస్ట్ అయ్యారు. ఆ దాడుల తర్వాత జరిపిన విచారణలో పలు నేరాలకు చేసిన కుట్రలు బయటపడ్డాయి.