మామూళ్లు ఇవ్వలేదని పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు...

మామూళ్లు ఇవ్వలేదని పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు...

హైదరాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు... మామూళ్లు వసూలు చేయడం... ఇవ్వకపోతే బెదిరించడం, దాడులు చేయడమే చూశాం... కానీ, అల్వాల్‌లో నవీన్ అనే రౌడీషీటర్... మామూళ్లు ఇవ్వని ఓ షాపు యజమానిపై పెట్రోల్ పోసి నిప్పటించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లే అల్వాల్‌లో రౌడీషీటర్ నవీన్ నెలవారీ మామ్మూళ్ల కోసం దాడులు చేస్తున్నాడు. మామూళ్లు ఇవ్వని ఓ షాపు యజమానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే పెట్రోల్ పోసి నిప్పుపెట్టే సమయంలో రౌడీషీటర్ నవీన్‌కు కూడా మంటలు అంటుకున్నాయి... మంటల్లో చిక్కుకున్న నవీన్‌కు తీవ్రగాయాలపాలయ్యారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు.