టైటిలే కాదు... పోస్టర్ కూడా టూ హాట్..!!

టైటిలే కాదు... పోస్టర్ కూడా టూ హాట్..!!

పూరి ఆకాష్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా చేస్తున్న సినిమా రొమాంటిక్.  పూరి కనెక్ట్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  పూరి సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఛార్మితో కలిసి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నారు.  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరలా లైన్లోకి వచ్చారు.  కొడుకును ఎలాగైనా ట్రాక్ లోకి తీసుకురావడానికి పూరి ట్రై చేస్తున్నారు.  రొమాంటిక్ సినిమా తీస్తున్నారు.  

ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు.  సినిమా పూర్తి చేస్తూనే మరోవైపు ఈ మూవీకి సంబంధించిన సింగిల్స్ ను, పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ వేడి పుట్టిస్తున్నారు.  ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ పోస్టర్ చూస్తుంటే, మరీ ఇంట రొమాంటిక్ అవసరమా అనిపించేలా ఉన్నది.  తెలుగు సినిమా గతి మారింది అని చెప్పడానికి ఈ పోస్టర్ ఒక ఉదాహరణ.  మామూలుగానే పూరి సినిమాలు చాలా హాట్ గా ఉంటాయి.  ఇప్పుడు రొమాంటిక్ సినిమా దానికి మించేలా అనే విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.