ఇంటి నుండి పని చేయడం అంత సులభం కాదు : రోహిత్ శర్మ

ఇంటి నుండి పని చేయడం అంత సులభం కాదు : రోహిత్ శర్మ

కరోనా వైరస్ కారణంగా  ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు అందరు స్వీయ గృహ నిర్బంధం పాటిస్తున్నారు. మన భారత క్రికెటర్స్ కూడా ఈ రోజు జనతా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. ఇక కరోనావైరస్ కారణంగా ప్రపంచ క్రీడా క్యాలెండర్‌ మొత్తం మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన లీగ్‌లు మరియు టోర్నమెంట్‌లతో వాయిదా పడ్డాయి లేదా రద్దు చేయబడ్డాయి. ఆదివారం, భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చేసిన ఓ ట్విట్ బాగా ఆకట్టుకుంది. ఆ ట్విట్ లో ఐసీసీ ఒక ఫోటో షేర్ చేస్తూ... ఐసీసీ చరిత్రలోనే పుల్ షాట్ ఆడే ఉత్తమ ఆటగాడి గురించి క్రికెట్ అభిమానులను అడిగింది. ఆ ఫోటో లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ మరియు హెర్షెల్ గిబ్స్ ఉన్నారు. అయితే దీనికి స్పందించిన రోహిత్ ఇక్కడ ఎవరో తప్పిపోయారా ?? ఇంటి నుండి పని చేయడం అంత సులభం కాదు" అని పోస్ట్ చేసాడు. అయితే అది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే  క్రికెట్ అభిమానులు కొంత మంది మాత్రం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ పుల్ షాట్ ఆడే వారిలో రోహిత్ శర్మ కూడా ఉంటాడని అభిప్రాయపడ్డారు.