రోహిత్- ధావన్ జోడి విజయానికి కారణం...

రోహిత్- ధావన్ జోడి విజయానికి కారణం...

2013 నుండి భారత జట్టుకు ఓపెనర్లుగా వ్యవహరిస్తూ అత్యుత్తమ జోడిగా పేరు తెచ్చుకున్నారు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్. అయితే వీరి జోడి విజయానికి కారణం ఒకరినొకరు అర్ధం చేసుకోవడమే అంటున్నాడు భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. రోహిత్ - ధావన్ జోడీ ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ లో 16 శతక భాగస్వామ్యాలు సాధించి రెండవ స్థానంలో ఉన్నారు. వారికంటే ముందు సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ 21 శతకాలతో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. మ్యాచ్ ఆరంభం లో శిఖర్ వేగంగా ఆడుతాడు. ఎందుకంటే... మరో ఓపెనర్ రోహిత్ క్రీజులో సెటిల్ కావడానికి కొంత సమయం తీసుకుంటాడు. దాంతో స్కోర్ సాధించాలి అనే ఒత్తిడి రోహిత్ పైన ఉండదు. ఇక రోహిత్ కు కావలసిన సమయం దొరికిన తర్వాత అతడిని ఆపడం ఎవరివల్ల కాదు''. ఇలా ఒకరి ఆటను మరొకరు అర్ధం చేసుకోవడం వల్లనే వారు ఉత్తమ జోడిలలో ఒకరయ్యారు అని పఠాన్ తెలిపాడు.  ఇక వారిద్దరిలో శిఖర్ పేసర్లను, రోహిత్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఇష్టపడుతారు. ఇది కూడా వారి విజయానికి ఒక కారణమే.